న్యూస్ బాక్స్ ఆఫీస్

(118) డే 6 ఓపెనింగ్స్…ఈ రోజు టార్గెట్ ఇదే!

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 118 బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి వసూళ్ళ తో దూసుకు పోతుంది, సినిమా అన్ సీజన్ లో రిలీజ్ అవ్వడం వలన మరీ అద్బుతమైన కలెక్షన్స్ ని అందుకోలేక పోతున్నా కేవలం మినిమమ్ డ్రాప్స్ తోనే సినిమా మంచి వసూళ్ళ ని అందుకుంటూ 5 రోజుల్లో వరల్డ్ వైడ్ గా ఆల్ మోస్ట్ 8 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర…

క్లీన్ హిట్ గా నిలవగా ఇప్పుడు సూపర్ హిట్ దిశగా అడుగులు వేస్తున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 6 వ రోజున మరో సారి వర్కింగ్ డే టెస్ట్ ను ఎదురు కోవడం తో డ్రాప్స్ గట్టిగానే ఉన్నాయి. 5 వ రోజు తో పోల్చితే 6 వ రోజు ఓవరాల్ గా డ్రాప్స్ ని తొలి రెండు…

షోల కి పరిగణిస్తే 50% వరకు డ్రాప్స్ ఉన్నట్లు సమాచారం. దాంతో సినిమా ఇదే రేంజ్ లో రోజు మొత్తం ఉంటె బాక్స్ ఆఫీస్ దగ్గర 40 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. అదే సినిమా ఈవినింగ్ అండ్ నైట్ షోలలో మళ్ళీ మంచి గ్రోత్ ని సాధిస్తే…

కచ్చితంగా 50 లక్షల నుండి 65 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పొచ్చు. మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ ని బట్టి ఈ లెక్కలు పెరగడమో తగ్గడ మో జరుగుతుంది అని చెప్పొచ్చు. ఇక సినిమా..

ఇప్పటికే బిజినెస్ ని క్రాస్ చేసి లాభాల పట్టడం తో తొలివారం ముగిసే సరికి 9 కోట్ల రేంజ్ కి చేరే అవకాశం ఉందని చెప్పాలి. రెండో వీకెండ్ లో తిరిగి జోరు చూపితే 10 కోట్ల మార్క్ ని అందుకోవచ్చు. ఇక 6 వ రోజు ఈవినింగ్ అండ్ నైట్ షోల సమయానికి సినిమా స్టేటస్ ఎలా ఉంటుందో చూడాలి.

Leave a Comment

Do NOT follow this link or you will be banned from the site!