న్యూస్ బాక్స్ ఆఫీస్

డే 2 కలెక్షన్స్…ఆ టాక్ ఏంటి ఈ కలెక్షన్స్ ఏంటి?

బాలీవుడ్ ఏస్ ఖాన్ అమీర్ ఖాన్ మరియు మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ల కాంబినేషన్ లో అత్యంత భారీ ఎత్తున రూపొందిన సినిమా థగ్స్ ఆఫ్ హిందోస్తాన్…. దీపావళి కానుకగా రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి ఆటకే నెగటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. కానీ కలెక్షన్స్ పరంగా మొదటి రోజు మొత్తం మీద ఇండస్ట్రీ రికార్డులను తిరగరాస్తూ ఏకంగా 52.75 కోట్ల నెట్ వసూళ్ళ ని సాధించి చరిత్ర సృష్టించింది.

ఇక సినిమా టాక్ అప్పటికే అంతటా స్ప్రెడ్ అయినా కానీ రెండో రోజు కూడా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భీభత్సమైన రేంజ్ లో హోల్డ్ చేసి కలెక్షన్స్ సెన్సేషన్ ని కంటిన్యూ చేస్తున్నట్లు సమాచారం. ట్రేడ్ అంచనా ప్రకారం సినిమా రెండో రోజు టోటల్ ఇండియా లో…

మినిమమ్ 35 కోట్ల నుండి 40 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని సాధించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీపావళి వీకెండ్ లో సినిమా మిగిలిన రెండు రోజుల్లో కూడా ఇదే రేంజ్ లో కుమ్మేస్తే దాదాపు బ్రేక్ ఈవెన్ అవ్వడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు.

Leave a Comment

Do NOT follow this link or you will be banned from the site!