న్యూస్ బాక్స్ ఆఫీస్

F2 4 వీక్స్ కలెక్షన్స్… కోటి వస్తే ఊచకోతే!

సంక్రాంతి రియల్ బ్లాక్ బస్టర్ F2 బాక్స్ ఆఫీస్ దగ్గర జోరు ని 4 వ వారం లో కూడా కొనసాగించి దుమ్ము లేపింది, సినిమా ఎక్కడా స్లో డౌన్ అవ్వకుండా మినిమమ్ కలెక్షన్స్ తో లాంగ్ రన్ ని మరింత దూరం ఆల్ మోస్ట్ కన్ఫాం చేసుకుని సత్తా చాటింది. కాగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద 3 వారాల్లో 75 కోట్ల క్లబ్ లో చేరగా 4 వ వీకెండ్ తర్వాత 25 రోజులకు గాను

వరల్డ్ వైడ్ గా 78.6 కోట్ల మార్క్ దాకా వసూళ్లు అందుకుని సత్తా చాటింది. ఇక మిగిలిన మూడు రోజుల్లో కూడా మినిమమ్ కలెక్షన్స్ తో రన్ అవుతూ దూసుకు పోయిన ఈ సినిమా ఓవరాల్ గా 79 కోట్ల షేర్ మార్క్ ని అధిగమించి సత్తా చాటింది.

సినిమా 4 వారాల టోటల్ కలెక్షన్స్ ని ఒకసారి పరిశీలిస్తే.. Nizam – 22.38 Cr Ceeded – 8.4 Cr UA – 9.94 Cr East – 7.08 Cr West – 4.06 Cr Krishna – 5.06 Cr Guntur – 5.48 Cr Nellore – 1.92 CrAP & TS combined – 64.32 Cr Karnataka – 4.5 Cr ROI – 0.85 Cr Overseas – 9.33 Cr Total – 79 Cr

సినిమా అల్టిమేట్ కలెక్షన్స్ జోరు ఇప్పుడు 5 వ వీకెండ్ లో కూడా కొనసాగి ఇక నుండి 1 కోటి వసూల్ చేస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర 80 కోట్ల హిస్టారికల్ షేర్ మార్క్ ని అందుకునే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పాలి. ఎలాగు సినిమా లాంగ్ రన్ లో 81 కోట్ల నుండి 82 కోట్ల…

రేంజ్ కలెక్షన్స్ తో పరుగును ఆపే అవకాశం పుష్కలంగా ఉంది, కానీ ఆన్ లైన్ లో అఫీషియల్ ప్రింట్ ఒకటి రెండు రోజుల్లో రాబోతుండటంతో అది కొంచం ప్రతికూలంగా మారినా ఈ సినిమా ఫైనల్ గా 80 కోట్ల కి పైగా షేర్ తో పరుగును ఆపవచ్చు అని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఇక 4 వారాల టోటల్ గ్రాస్ 128 కోట్ల వరకు ఉందని సమాచారం. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

Leave a Comment

Do NOT follow this link or you will be banned from the site!