గాసిప్స్ న్యూస్

ఉన్నది ఉన్నట్లు తీసి-క్రియేటివిటీ వాడి ఈ సారి “40 కోట్లు” కలెక్ట్ చేస్తాడట

  రీమేక్ ల విషయం కొన్ని సార్లు ఉన్నది ఉన్నట్లు తీస్తే మన వాళ్లకి నచ్చకపోయే అవకాశం ఉంటుంది, అలాగే నచ్చుతుందో లేదో అనే డౌట్ లో ఉన్నది లేనిది కలిపి కొత్త క్రియేటివిటీ చూపిస్తే అసలుకే ఎసరు తగిలే అవకాశం ఉంది. ఇది గమనించిన కొందరు కొన్ని సబ్జెక్ట్లను ఎలాంటి మార్పులు చేర్పులు లేకుండానే ఉన్నది ఉన్నట్లు తీస్తు౦టారు. తమిళ్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన జిగాత్తాండ అనే సినిమా అద్బుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది,

సిద్దార్థ్ హీరోగా నటించిన ఈ సినిమా తెలుగు లో తర్వాత డబ్ అయ్యిన ఎవ్వరూ పట్టించుకోలేదు. కానీ కాన్సెప్ట్ మాత్రం కమర్షియల్ గా వర్కౌట్ అయ్యే సబ్జెక్ట్ అని చెప్పాలి. కాగా ఇప్పుడు ఈ సినిమాని తెలుగు లో వరుణ్ తేజ్ – హరీష్ శంకర్ ల కాంబినేషన్ లో రూపొందిస్తున్నారు.

హీరోగా స్లో గా స్టార్ అయినా ఫిదా, తొలిప్రేమ మరియు F2 సినిమాలతో తన రేంజ్ ని ఓ లెవల్ లో పెంచుకున్న వరుణ్ తేజ్ ఈ సారి మరో 40 కోట్లు మినిమమ్ అందుకోవడం ఖయామని అంతా భావిస్తున్నారు. ఇక దర్శకుడు హరీష్ శంకర్ గబ్బర్ సింగ్ తో రీమేక్ లను సూపర్ గా హాండిల్ చేయగలను అని నిరూపించుకున్నాడు.

ఇక్కడ కూడా ఉన్న కథ ని చెడగొట్టకుండా అలానే ఉంచి గబ్బర్ సింగ్ రేంజ్ లో తన క్రియేటివిటీ తో కొన్ని స్పెషల్ అట్రాక్షన్ సీన్స్ ని పెట్టి సినిమాను తెరకెక్కించ బోతున్నట్లు చెబుతున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వాల్మీకి సినిమా ఈ ఇయర్ సెకెండ్ ఆఫ్ లో రానుంది.

జిగాత్తాండ యూనివర్సల్ సబ్జెక్ట్ అని అందులో ఎలాంటి మార్పులు అవసరం లేదని ఉన్నది ఉన్నట్లు తీసి  కొన్ని స్పెషల్ అట్రాక్షన్ సీన్స్ ని పెట్టి మినిమమ్ 40 కోట్లు అందుకోవాలని చూస్తున్నాడట హరీష్ శంకర్.. సినిమాలో అంత పోటెన్శియాలిటి ఉంది కాబట్టి మార్పులు అవసరం లేదు. మరి అనుకున్నది సాధిస్తాడో లేదో చూడాలి.

Leave a Comment

Do NOT follow this link or you will be banned from the site!