న్యూస్ ప్రీ రిలీజ్ బిజినెస్ బాక్స్ ఆఫీస్

118 బిజినెస్…టార్గెట్ ఇదే

పటాస్ తర్వాత మళ్ళీ అలాంటి విజయం కోసం ఎదురు చూస్తున్న నందమూరి కళ్యాణ్ రామ్ కమర్షియల్ మూవీస్ చేసినా మళ్ళీ అలాంటి సక్సెస్ అయితే దక్కలేదు. ఇలాంటి సమయం లో కెరీర్ లో తానూ ఎక్కువగా చేసిన ప్రయోగాత్మక సినిమా ల వైపు మరోసారి అడుగులు వేయాలి అని డిసైడ్ అయిన కళ్యాణ్ రామ్ రీసెంట్ గా చేసిన డిఫెరెంట్ మూవీ 118. సస్పెన్స్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది.

కాగా సినిమా భారీ గానే రిలీజ్ అవుతుండగా సినిమా ఓవరాల్ గా సాధించిన బిజినెస్ లెక్కలు తెలియవచ్చాయి. సినిమా నైజాం మరియు ఆంధ్ర ఏరియాల్లో 5 కోట్ల రేంజ్ లో బిజినెస్ ని సొంతం చేసుకోగా సీడెడ్ ఏరియా కి గాను 1.3 కోట్ల బిజినెస్ ని సొంతం చేసుకుంది.

దాంతో రెండు తెలుగు రాష్ట్రాలలో సినిమా 6.3 కోట్ల బిజినెస్ ని సొంతం చేసుకోగా కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా లో 50 లక్షలు… టోటల్ ఓవర్సీస్ లో 1.2 కోట్ల రేంజ్ లో సినిమా బిజినెస్ ని సొంతం చేసుకోగా టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్…

8 కోట్లు అయింది, దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వడానికి 9 కోట్ల వరకు షేర్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకోవాల్సి ఉంటుంది. రీసెంట్ టైం లో రిలీజ్ అవుతున్న చాలా సినిమాలు అంచనాలను తప్పుతున్నా డిఫెరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా పై…

బజ్ కొంచం పాజిటివ్ గానే ఉన్నా కానీ బాక్స్ ఆఫీస్ క్రేజ్ మాత్రం అనుకున్న లెవల్ లో లేదు. టాక్ వస్తేనే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పుంజుకునే అవకాశం ఉందని చెప్పాలి. మరి సినిమా ఎంతవరకు కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

Leave a Comment

Do NOT follow this link or you will be banned from the site!