టోటల్ కలెక్షన్స్ న్యూస్ బాక్స్ ఆఫీస్ స్పెషల్

కర్ణాటక ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసిన టాప్ తెలుగు సినిమాలు ఇవే

తెలుగు పరిశ్రమ కి రెండు తెలుగు రాష్ట్రాలు ఓవర్సీస్ తరువాత అతి పెద్ద మార్కెట్ కర్ణాటక. తెలుగు- కన్నడ దగ్గర దగ్గరగా ఉండటం తో తెలుగు సినిమా లను డైరెక్ట్ గా చూడటం అలవాటు చేసుకున్న కన్నడ ప్రేక్షకులు తెలుగు సినిమా లను కన్నడ డైరెక్ట్ సినిమాల తో సమానంగా ఆదరించడం మొదలు పెట్టారు. అక్కడ మన సినిమా లకు విడుదల అవుతున్నాయి అంటే కన్నడ డైరెక్ట్ సినిమా లకు ఏమాత్రం తక్కువ కానీ ఓపెనింగ్స్ రావడం కూడా కామన్ అయి పొయింది.

ఇప్పుడు కన్నడలో టాప్ 12 ప్లేస్ లలో నిలిచిన తెలుగు సినిమాలు ఏవో తెలుసుకుందాం పదండి

టాప్ 12 అల్లుఅర్జున్ దువ్వాడ జగన్నాథం(2017):-

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ దువ్వాడ జగన్నాథం బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్మురేపే కలెక్షన్స్ తో 70 కోట్ల షేర్ వసూల్ చేసింది. ఈ సినిమా టోటల్ రన్ లో కర్ణాటకలో 6.76 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది.సినిమాకి వచ్చిన టాక్ కి అతీతంగా కలెక్షన్స్ వర్షం కురిపించి సత్తా చాటుకుంది ఈ సినిమా.

టాప్ 11 అల్లుఅర్జున్ సరైనోడు(2016):-

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ సరైనోడు బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్మురేపే కలెక్షన్స్ తో 75 కోట్ల షేర్ వసూల్ చేసింది. ఈ సినిమా టోటల్ రన్ లో కర్ణాటకలో 6.85 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది.

టాప్ 10 ఎన్టీఆర్ నాన్నకుప్రేమతో(2016):-

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన 25 వ సినిమా నాన్నకుప్రేమతో రెండు తెలుగు రాష్ట్రాల్లో మిగతా సినిమాల పోటివల్ల కొద్దిగా వెనుకడుగు వేసినా తెలుగు రాష్ట్రాల అవతల మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది. టోటల్ రన్లో 6.90 కోట్లు వసూల్ చేసిన నాన్నకుప్రేమతో ఆల్ టైం 10 ప్లేస్ లో నిలిచింది.

టాప్ 9. రామ్ చరణ్ ధృవ(2016):-

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ మూవీ ధృవ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రస్తుతం 6.96 కోట్లతో బాక్స్ ఆఫీస్ పరుగు ఆపి టాప్ 9. ప్లేస్ ని దక్కించుకుంది. డీమానిటైజేషన్ లో కూడా ధృవ ఇలాంటి కలెక్షన్స్ రికార్డులు నమోదు చేయడం మాములు విషయం కాదని చెప్పొచ్చు.

టాప్ 8 మహేష్ బాబు శ్రీమంతుడు(2015):-

రెండు అట్టర్ ఫ్లాఫ్స్ తరువాత సాలిడ్ కం బ్యాక్ ఇచ్చాడు మహేష్ బాబు. శ్రీమంతుడుతో తెలుగులో నాన్ బాహుబలి రికార్డులు సృష్టించిన మహేష్ కర్ణాటకలో కూడా రికార్డులు సృష్టించి టోటల్ గా 7.10 కోట్లు వసూల్ చేసి టాప్ 8 ప్లేస్ లో సెటిల్ అయ్యాడు.

7 భరత్ అనే నేను(2018):-

సూపర్ స్టార్ మహేశ్ బాబు కొరటాల శివల కాంబినేషన్ లో వచ్చిన భరత్ అనే నేను బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలన కలెక్షన్స్ తో 100 కోట్ల షేర్ మార్క్ ని అందుకోవడమే కాకుండా కర్నాటకలో టోటల్ రన్ లో 8.3 కోట్ల షేర్ ని అందుకుంది సంచలనం సృష్టించింది.

టాప్ 6 ఎన్టీఆర్ జనతాగ్యారేజ్(2016):-

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ సెన్సేషన్ జనతాగ్యారేజ్ కర్ణాటకలో తెలుగు సినిమాలలో ఆల్ టైం రికార్డును అందుకుంది. టోటల్ రన్ కాకుండా అక్కడ టాప్ 2 ప్లేస్ లో నిలిచిన శ్రీమంతుడు టోటల్ రన్ షేర్ 7 కోట్లని క్రాస్ చేసింది. టోటల్ రన్ లో 8.1 కోట్లు కలెక్ట్ చేసి టాప్ 6 ప్లేస్ ని దక్కించుకుంది.

టాప్ 5 ఎన్టీఆర్ జైలవకుశ(2017):-

టాలీవుడ్ తలైవా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన జైలవకుశ బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపే కలెక్షన్స్ ని సాధించగా ఎన్టీఆర్ కెరీర్ లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ తో దుమ్ము లేపి టోటల్ రన్ లో ఈ సినిమా టోటల్ గా 8.9 కోట్లకు పైగా షేర్ ని కలెక్ట్ చేసి అక్కడ ఆల్ టైం నాలుగో ప్లేస్ ని సొంతం చేసుకుంది.

టాప్ 4 చిరంజీవి ఖైదీనంబర్150(2017):-

10 ఏళ్ల తర్వతా మెగాస్టార్ చిరంజీవి నటించిన మెగా కం బ్యాక్ మూవీ ఖైదీనంబర్150 బాక్స్ ఆఫీస్ దగ్గర 9.1 కోట్ల షేర్ ని అందుకుంది…. టాలీవుడ్ చరిత్రలోనే నాన్ బాహుబలి రికార్డులతో సంచలనం సృష్టించి ఆల్ టైం బిగ్గెస్ట్ నాన్ బాహుబలి మూవీ గా అవతరించింది ఈ సినిమా.

టాప్ 3  రామ్ చరణ్ రంగస్థలం(2018):-

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సుకుమార్ ల కాంబినేషన్ లో వచ్చిన సెన్సేషనల్ మూవీ రంగస్థలం కన్నడ గడ్డపై ఆల్ టైమ్ నాన్ బాహుబలి రికార్డును నమోదు చేస్తూ ఏకంగా 9.21 కోట్ల షేర్ తో ఖైదీ నంబర్ 150 ని క్రాస్ చేసి ఆల్ టైమ్ రికార్డ్ ను సొంతం చేసుకుంది.

టాప్ 2 ప్రభాస్ బాహుబలి(2015):-

ఎస్.ఎస్.రాజమౌళి ఆల్ టైం ఎపిక్ మాగ్నం ఓపస్ బాహుబలి తెలుగు సినిమాల్లోనే కాదు ఏకంగా కన్నడ డైరెక్ట్ సినిమాల రికార్డులను కూడా తుడిచిపెట్టి కొత్త రికార్డులను సృష్టించింది. ఆ రికార్డులను అందుకోవడం కన్నడ డైరెక్ట్ సినిమాలకు ఇప్పట్లో కుదిరే విషయం కాదంటే అతిశయోక్తి కాదేమో. టోటల్ రన్ లో 38 కోట్ల కలెక్షన్స్ సాధించి ఆల్ టైం హిస్టారికల్ రికార్డును నెలకొల్పింది బాహుబలి.

టాప్ 1 ప్రభాస్ బాహుబలి2(2017):-

ఎస్.ఎస్.రాజమౌళి ఆల్ టైం ఎపిక్ మాగ్నం ఓపస్ బాహుబలి పార్ట్ 2 తెలుగు సినిమాల్లోనే కాదు ఏకంగా ఇండియాలోనే దిమ్మతిరిగిపోయే కలెక్షన్స్ తో చుక్కలు చూయింది. ఇక కన్నడ డైరెక్ట్ సినిమాల రికార్డులను కూడా తుడిచిపెట్టి కొత్త రికార్డులను సృష్టించింది. ఆ రికార్డులను అందుకోవడం కన్నడ డైరెక్ట్ సినిమాలకు ఇప్పట్లో కుదిరే విషయం కాదంటే అతిశయోక్తి కాదేమో. 52 కోట్ల కలెక్షన్స్ సాధించి ఆల్ టైం హిస్టారికల్ రికార్డును నెలకొల్పింది బాహుబలి2…..

ఇవి కర్ణాటక గడ్డ మీద దుమ్ము రేపిక టాప్ తెలుగు సినిమాలు. ఇందులో మీ ఫేవరేట్ సినిమా ఎదో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి.

Leave a Comment

Do NOT follow this link or you will be banned from the site!