గాసిప్స్ న్యూస్

KGF చాప్టర్ 2 రన్ టైం డీటైల్స్ లీక్…ఇంత లెంతా…అయినా కుమ్ముడే!!

2021 ఇయర్ ఇండియా లో మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో ముందు నిలిచే సినిమా KGF చాప్టర్ 2, మూడేళ్ళ క్రితం వచ్చిన చాప్టర్ 1 ఊహకందని విజయాన్ని నమోదు చేయడం తో సెకెండ్ పార్ట్ పై అంచనాలు ఓ రేంజ్ లో ఉండగా ఎప్పుడెప్పుడు సెకెండ్ పార్ట్ బాక్స్ ఆఫీస్ దగ్గర వీర విహారం చేస్తుందా అని ప్రతీ ఒక్కరూ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. పరిస్థితులు అన్నీ ముందుగా ఉండి ఉంటే సినిమా ముందు అనుకున్నట్లే…

జులై లో ఆడియన్స్ ముందుకు వచ్చేది కానీ ఇప్పుడు సినిమా కొంచం ఆలస్యంగానే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక సినిమా కి సంభందించిన రన్ టైం డీటైల్స్ ఇప్పుడు లీక్ అయ్యాయి. ఆల్ మోస్ట్ షూటింగ్ ను పూర్తీ చేసుకుని…

పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉన్న మూవీ ఓవరాల్ రన్ టైం వివరాలు 2 గంటల 50 నిమిషాల లెంత్ తో కూడుకుని ఉంటుందని అంటున్నారు. కానీ ఇది కొంచం రఫ్ కట్ కూడా ఇంక్లూడ్ అయ్యి చెప్పిన రన్ టైం అని, ఫైనల్ కట్ రన్ టైం కొంచం తగ్గే అవకాశం ఉందని అంటున్నారు.

అయినా కానీ ఓవరాల్ గా రన్ టైం 2 గంటల 40 నిమిషాలకు తగ్గకుండా ఉండే అవకాశం ఉందని అంటున్నారు. ఇక సినిమాలో 2 స్పెషల్ ఐటెం సాంగ్స్ ఉంటాయని, ఒకటి ఫస్టాఫ్ లో ఒకటి సెకెండ్ ఆఫ్ లో వస్తాయని సమాచారం. మాస్ ఎలిమెంట్స్ ఫస్ట్ చాప్టర్ తో పోల్చితే సెకెండ్ పార్ట్ లో మరో లెవల్ లో ఉండేలా ప్లాన్ చేశారని…. ఆ సీన్స్ కి…

థియేటర్స్ లో పూనకాలు ఖాయం అని ధీమా గా ఉన్నారట టీం. ఓవరాల్ గా రఫ్ కట్ మొదటి చాప్టర్ కి ధీటుగా వచ్చింది అన్నది సినిమా పై వినిపిస్తున్న గట్టి టాక్. ఇదే కనుక నిజం అయితే మట్టుకు బాక్స్ ఆఫీస్ షేక్ అవ్వడం ఖాయం, ఇక పరిస్థితులు సద్దుకుంటే సెకెండ్ ఆఫ్ లో ఈ సినిమా కలెక్షన్స్ సునామీ సృష్టించడం ఖాయమని చెప్పొచ్చు.

Leave a Comment