న్యూస్ ప్రీ రిలీజ్ బిజినెస్ బాక్స్ ఆఫీస్

లక్ష్మీస్ ఎన్టీఆర్ ప్రీ రిలీజ్ బిజినెస్…టాక్ వస్తే ఊచకోతే!!

వివాదాస్పద చిత్రాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం లో టాలీవుడ్ లో క్లీన్ హిట్ కొట్టి దశాబ్దం పైనే అవుతుంది, రక్తచరిత్ర తో హిట్ కొట్టిన వర్మ మళ్ళీ ఇప్పటి వరకు హిట్ కొట్టలేదు. కానీ ఇప్పుడు వర్మ డైరెక్షన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ లక్ష్మీస్ ఎన్టీఆర్ పై మాత్రం అంచనాలు భారీ గా ఉన్నాయి. సీనియర్ ఎన్టీఆర్ గారి లైఫ్ లో ఎక్కువ మందికి తెలిసినా.. కానీ బయటికి చెప్పని…

ఎన్నో విషయాలను ఈ కథ లో చెప్పబోతున్నాను అని ఇప్పటికే సినిమా కి కావలసినంత క్రేజ్ ని సొంతం చేసుకున్న రామ్ గోపాల్ వర్మ బిజినెస్ పరంగా మాత్రం అత్యుత్సాహం ప్రదర్శించ కుండా అందరికీ సేఫ్ గా ఉండేలా సినిమా బిజినెస్ జరిగేలా చూసుకున్నాడు.

రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రస్తుతం ఉన్న ఎలక్షన్స్ ని గమనించి రిలీజ్ కి అడ్డు తగిలే అవకాశం ఎక్కువగా ఉండటం తో అన్ని థియేటర్స్ ఓనర్స్ తో సినిమాను అడ్వాన్స్ బేస్ మీద రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. అది కలుపుకున్నా ఓవరాల్ బిజినెస్ రేంజ్ ఎలా ఉందంటే…

రెండు రాష్ట్రాలలో 9 కోట్ల నుండి 9.5 కోట్ల రేంజ్ లో, రెండు రాష్ట్రాల ఆవల కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా లో 80 లక్షల రేంజ్ లో ఇక ఓవర్సీస్ లో 1.5 కోట్ల రేంజ్ లో సినిమా బిజినెస్ ని సొంతం చేసుకుందట. దాంతో టోటల్ వరల్డ్ వైడ్ బిజినెస్ రేంజ్ సుమారుగా…

12 కోట్ల రేంజ్ లో ఉంటుందని, దాంతో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ 13 కోట్ల రేంజ్ లో వసూళ్లు సాధిస్తే సరిపోతుందని చెప్పొచ్చు. సినిమా పై ఉన్న క్రేజ్ దృశ్యా హిట్ టాక్ వస్తే ఈ మార్క్ ని అందుకోవడం ఏమాత్రం కష్టం కాదని చెప్పొచ్చు. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

Leave a Comment

Do NOT follow this link or you will be banned from the site!