న్యూస్ బాక్స్ ఆఫీస్

మారి 2 ఫస్ట్ డే కలెక్షన్స్…జోరు పెంచాలి!

తమిళ్ స్టార్ హీరో ధనుష్ నటించిన లేటెస్ట్ మూవీ మారి 2 తెలుగు లో కూడా భారీ గానే రిలీజ్ అయిన విషయం తెలిసిందే. పోటి లో రిలీజ్ అవ్వడం వలన సినిమా కి పెద్దగా ఓపెనింగ్స్ దక్కలేదు కానీ మంచి మాస్ మసాలా పైసా వసూల్ అవ్వడం తో రానున్న రోజుల్లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మెల్లి గా జోరు పెంచే అవకాశం అయితే పుష్కలంగా ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

సినిమా మొత్తం మీద తమిళనాడు లో 3 కోట్ల గ్రాస్ ని అందుకోగా తమిళ్ వర్షన్ వరల్డ్ వైడ్ గా 6 కోట్ల గ్రాస్ ని అందుకుని 3 కోట్ల రేంజ్ లో షేర్ ని మొదటి రోజు సాధించినట్లు సమాచారం. ఇక తెలుగు వర్షన్ కి గాను రెండు రాష్ట్రాలలో ఈ సినిమా టోటల్ గా 30 లక్షల రేంజ్ లో…

వసూల్ చేసినట్లు సమాచారం..కాగా తెలుగు బిజినెస్ సుమారుగా 3.3 కోట్ల రేంజ్ లో ఉండటం తో బ్రేక్ ఈవెన్ కి సినిమా 4 కోట్ల దాకా షేర్ ని వసూల్ చేయాల్సి ఉంటుంది. మరి రానున్న రోజుల్లో సినిమా జోరు పెంచితే ఈ మార్క్ ని అందుకోవడం పెద్ద కష్టం కాదనే చెప్పాలి.

Leave a Comment

Do NOT follow this link or you will be banned from the site!