టోటల్ కలెక్షన్స్ న్యూస్ బాక్స్ ఆఫీస్

అమ్మింది 35.5 కోట్లకి…ఫైనల్ గా వచ్చింది ఇది…పాపం ధనుష్!

కోలివుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన లేటెస్ట్ మూవీ మారి 2 బాక్స్ ఆఫీస్ దగ్గర డిసెంబర్ చివరి వీక్ లో రిలీజ్ అవ్వగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ నే సొంతం చేసుకున్నా అటు తమిళ్ లో ఇటు తెలుగు లో భారీ పోటి ఉండటం తో తేరుకోలేక పోయింది. ఓవరాల్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రీ రిలీజ్ బిజినెస్ ని అందుకోవడం లో విఫలం అయింది.

సినిమా మొత్తం మీద తమిళ్ వర్షన్ ని 32 కోట్లకు అమ్మగా సినిమా తమిళనాడు లో 16 కోట్లు, టోటల్ వరల్డ్ వైడ్ గా 20 కోట్ల షేర్ ని అందుకుంది, ఇక తెలుగు వర్షన్ టోటల్ గా 3.5 కోట్లకు అమ్మగా సినిమా టోటల్ గా 1.8 కోట్ల షేర్ ని ఇక్కడ సాధించింది.

దాంతో టోటల్ వరల్డ్ వైడ్ గా 35.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ కి సినిమా 22 కోట్ల లోపు వసూళ్ళతో సరిపెట్టి ఏకంగా 13 కోట్ల రేంజ్ లో నష్టాలను మిగిలించింది. ఈ సినిమాతో కమర్షియల్ గా భారీ హిట్ కొట్టాలి అనుకున్న ధనుష్ కి ఒకింత షాక్ నే ఇచ్చింది ఈ సినిమా.

Leave a Comment

Do NOT follow this link or you will be banned from the site!