న్యూస్

ఫ్యాన్స్ గొడవ పీక్స్…నేషనల్ వైడ్ ట్రెండ్!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వంశీ పైడిపల్లి ల కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ మహర్షి సమ్మర్ రేసు లో రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే, ముందుగా ఏప్రిల్ 5 న రిలీజ్ అనుకున్నా కానీ తర్వాత రిలీజ్ డేట్ ని ఏప్రిల్ 25 కి పోస్ట్ పోన్ చేసినప్పుడే ఫ్యాన్స్ మండి పడ్డారు. ఆ డేట్ వద్దంటే వద్దు అని సోషల్ మీడియా లో సినిమా యూనిట్ కి మెసేజ్ లు చేశారు.

కాగా తర్వాత ఎలెక్షన్ కోడ్ కూడా ఉండటం తో ఆ డేట్ నుండి పోస్ట్ పోన్ అవుతుంది అన్న టాక్ గట్టిగా వినిపించగా రీసెంట్ గా దిల్ రాజు అఫీషియల్ గా మేం 25 నే వస్తున్నాం అంటూ అనౌన్స్ చేయడం తో కొందరు రిలీజ్ డేట్ పై సంతోషంగానే ఉన్నా కానీ..

ఎక్కువ మంది మాత్రం ఆ డేట్ పై అస్సలు సంతోషంగా లేరు, దానికి ప్రధాన కారణం ఒక రోజు తేడా తో ప్రస్తుతం వరల్డ్ వైడ్ సినీ లవర్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న అవెంజర్స్ ఎండ్ గేమ్ రిలీజ్ అవుతుండటమే. రెండు తెలుగు రాష్ట్రాలలో మహేష్ సినిమా కి డోకా లేదు కానీ..

కర్ణాటక అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ లో మాత్రం అవెంజర్స్ ను ఎదురుకోవడం చాలా కష్టమే అనే చెప్పాలి. దాంతో కలెక్షన్స్ పై ఆ ఇంపాక్ట్ గట్టిగా పడే అవకాశం ఉండటం తో ఆ డేట్ అస్సలు వద్దు అంటూ నేషనల్ వైడ్ గ మహేష్ అభిమానులు..

#WeDontWantMaharshiOnApril25th అంటూ ట్రెండ్ చేశారు, సినిమా లాంగ్ రన్ ఎంత ఉన్నా కానీ ముందు ఓపెనింగ్స్ సాలిడ్ గా ఉండాలి అంటే సోలో రిలీజ్ బెటర్ అని చెప్పొచ్చు. మరి నిర్మాతలు ఫ్యాన్స్ కోరికను మన్నిస్తారో లేదో చూడాలి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

Leave a Comment

Do NOT follow this link or you will be banned from the site!