న్యూస్ బాక్స్ ఆఫీస్ స్పెషల్

నాని పై విరుచుకుపడ్డ (మెగా ఫ్యాన్స్)… రీజన్ ఇదే!

  టాలీవుడ్ లో ఉన్న హీరోల్లో ఎలాంటి కాంట్రవర్సీ లు లేని ఇమేజ్ ఉన్న హీరోగా పేరు సొంతం చేసుకున్న నాచురల్ స్టార్ నాని పై బిగ్ బాస్ నుండి కొంత వ్యతిరేకత వెల్లువెత్తిన విషయం తెలిసిందే, తర్వాత కొంచం సద్దుమనగా ఇప్పుడు మరోసారి ఫ్యాన్స్ కి టార్గెట్ అయ్యాడు నాని. కానీ ఈ సారి టార్గెట్ అవ్వడానికి రీజన్ తన అప్ కమింగ్ మూవీ కి పెట్టిన టైటిల్ అని తెలుస్తుంది.

నాని ప్రస్తుతం విక్రం కే కుమార్ డైరెక్షన్ లో నాని’స్ గ్యాంగ్ లీడర్ అనే సినిమా చేస్తున్నాడు. దాంతో మెగా ఫ్యాన్స్ బాగా హార్ట్ అయ్యారు, డానికి కారణం మెగాస్టార్ చిరంజీవి మెగా బ్లాక్ బస్టర్ మూవీస్ లో గ్యాంగ్ లీడర్ కి స్పెషల్ క్రేజ్ ఉంటుంది, ఆ సినిమా ను కానీ..

ఆ టైటిల్ ని కానీ తిరిగి వాడుకుంటే కనుక కేవలం మెగా వారసుడు అయిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాత్రమె వాడుకోవాలి అని, అలాంటిది ఆ టైటిల్ ని నువ్వు ఎలా వాడుకుంటావ్ అంటూ సోషల్ మీడియా లో #BoycottNanisGangLeader అంటూ నెగటివ్ ట్రెండ్ ని చేశారు మెగా ఫ్యాన్స్.

దాంతో నాని కి సపోర్ట్ గా ఇతర హీరోల ఫ్యాన్స్ కొంచం ముందుకు వచ్చి రామ్ చరణ్ హిందీ లో తొలి పరిచయం తో నే అక్కడ మెగాస్టార్ అయిన అమితాబ్ కెరీర్ బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటైన “జంజీర్” సినిమా టైటిల్ ని వాడుకోవచ్చు కానీ ఇక్కడ ఎలాంటి స్టార్ బ్యాగ్ డ్రాప్…

లేకుండా స్టార్ గా ఎదిగిన నాని టైటిల్ ని వాడుకుంటే తప్పు ఏంటి అంటూ సపోర్ట్ చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ నాని పుట్టిన రోజు కానుకగా రివీల్ చేసిన ఈ టైటిల్ సినిమా క్రేజ్ ని పెంచడం అలాగే కొత్త కాంట్రవర్సీ కి కారణం అవ్వడం రెండు జరిగిపోయాయి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

Leave a Comment

Do NOT follow this link or you will be banned from the site!