న్యూస్ బాక్స్ ఆఫీస్

NGK థియేటర్స్ కౌంట్…ఇంత తక్కువనా??

కోలివుడ్ స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ మూవీ NGK భారీ ఎత్తున మరి కొన్ని గంటల్లో రిలీజ్ కానుంది, కాగా సినిమా ఓవరాల్ గా తెలుగు లో 9 కోట్ల దాకా బిజినెస్ ని సొంతం చేసుకుంది, దాంతో 10 కోట్ల రేంజ్ లో టార్గెట్ తో బరిలోకి దిగుతుంది ఈ సినిమా. ఇక సినిమా ఓవరాల్ గా రెండు తెలుగు రాష్ట్రాలలో రిలీజ్ అవుతున్న థియేటర్స్ కౌంట్ మాత్రం యావరేజ్ గానే ఉందని చెప్పాలి.

పోటి ఎక్కువగా ఉండటం… కొత్త పాత సినిమాలు థియేటర్స్ ఆక్యుపై చేయడం తో NGK కి మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాల్లో 400 కి పైగానే థియేటర్స్ దొరికాయి. ఓవరాల్ గా నైజాం లో సినిమా 150 వరకు థియేటర్స్ లో రిలీజ్ కానుండగా సీడెడ్ లో 80 థియేటర్స్ లో…

అలాగే ఆంధ్రా లో 180 వరకు థియేటర్స్ లో రిలీజ్ కానుంది, దాంతో మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాలలో 410 కి పైగా థియేటర్స్ లో రిలీజ్ కానుంది. టాక్ బాగుంటే లాంగ్ రన్ లో థియేటర్స్ కౌంట్ పెరిగే అవకాశం ఉందని చెప్పాలి. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఎలాంటి జోరు ని చూపుతుంది అన్నది ఆసక్తి గా మారింది.

Leave a Comment

Do NOT follow this link or you will be banned from the site!