న్యూస్ రివ్యూ

NGK ప్రీమియర్ షో రివ్యూ…హిట్టా-ఫట్టా!!

కోలివుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ ఉన్న హిరో సూర్య కి రీసెంట్ టైం లో సరైన హిట్ లేదు, ఇలాంటి సమయం లో సెల్వ రాఘవన్ డైరెక్షన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ NGK తో నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు సూర్య, ముందుగా ఓవర్సీస్ లో సుమారు 150 కి పైగా లోకేషన్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా కి అక్కడ నుండి మొదటిటాక్ ఎలా ఉందొ తెలుసుకుందామ్ పదండి.

ముందుగా స్టొరీ పాయింట్ కి వస్తే… రాజకీయాలు అంటే ఇష్టముండే హీరో కి రాజకీయాల్లో ముందు అనేక అవరోధాలు ఎదురు అవుతాయి. కానీ రూట్ మార్చి కొత్తగా రాజేకీయం మొదలు పెట్టిన హీరో తాను అనుకున్నది సాధించాడా లేదా అన్నది అసలు కథ అంటున్నారు.

కథ పాయింట్ మొత్తం పొలిటికల్ బ్యాగ్ డ్రాప్ లోనే ఉన్నా సూర్య పెర్ఫార్మెన్స్ తో దుమ్ము లేపాడని అంటున్నారు, యాక్షన్ సీన్స్ లో రెచ్చిపోయాడని అంటున్నారు, హీరోయిన్స్ సాయి పల్లవి అలాగే రకుల్ ల రోల్స్ చిన్నవే అయినా ఆకట్టుకుంటారని అంటున్నారు.

సంగీతం యావరేజ్ గా ఉన్న బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం యువన్ శంకర్ రాజా దుమ్ము లేపాడని అంటున్నారు, లెంత్ కొంచం ఎక్కువ అయిన ఫీలింగ్ సెకెండ్ ఆఫ్ స్లో అయిన ఫీలింగ్ కలుగుతుందని, డైరెక్టర్ సెల్వ రాఘవన్ కథ పాయింట్ చిన్నదే తీసుకున్నా చాలా వరకు ఆకట్టుకునే స్క్రీన్ ప్లే తో మెప్పిస్తాడని అంటున్నారు.

మొత్తం మీద సినిమా ఎలా ఉంది అంటే మాత్రం మరీ అద్బుతం కాకున్నా ఈజీ గా సూర్య కోసం ఒకసారి చూసే విధంగా ఉందని, ఎబో యావరేజ్ గా అనిపించిందని అంటున్నారు, ఇదీ మొత్తం మీద ఓవర్సీస్ టాక్. ఇక రెగ్యులర్ షోలకు కూడా ఇదే రేంజ్ టాక్ ని సొంతం చేసుకుంటే సూర్య కి ఈ సారి టార్గెట్ తక్కువే అవ్వడం దుమ్ము లేపే అవకాశం ఉందని చెప్పొచ్చు.

Leave a Comment