న్యూస్ బాక్స్ ఆఫీస్ స్పెషల్

NTR పై సురేందర్ రెడ్డి కామెంట్స్…ఫ్యాన్స్ షాకింగ్ రియాక్షన్!!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం అపజయం అంటే తెలియకుండా వరుసగా 5 సినిమాలుగా దూసుకు పోతున్నాడు… కానీ ఇది వరకు ఎన్టీఆర్ పై ఒక అపవాదు ఉండేది, అది ఏమిటి అంటే ఎన్టీఆర్ కేవలం హిట్ డైరెక్టర్స్ తోనే వర్క్ చేస్తాడు అని, అందరూ కాకున్నా టెంపర్ కి ముందు దూకుడు తర్వాత బాద్ షా, గబ్బర్ సింగ్ తర్వాత రామయ్యా వస్తావయ్యా, కందిరీగ తర్వాత రభస లాంటి హిట్ డైరెక్టర్స్ తో సినిమా చేశాడు ఎన్టీఆర్..

కానీ వాటిలో బాద్ షా తప్పితే చాలా సినిమాలు నిరాశనే మిగిలించగా తన రూట్ తప్పని తెలుసుకుని కథ ని మాత్రమె నమ్మి టెంపర్ నుండి అరవింద సమేత వరకు ఒక్క కొరటాల విషయంలో తప్పితే మిగిలిన 4 సినిమాలు ఫ్లాఫ్ డైరెక్టర్స్ తోనే చేసి అల్టిమేట్ కంబ్యాక్ ఇచ్చి దుమ్ము లేపాడు.

అలాంటి ఎన్టీఆర్ పై ఇప్పుడు సైరా డైరెక్టర్ సురేందర్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశాడు, డైరెక్ట్ ఎన్టీఆర్ అని చెప్పకున్నా ఎన్టీఆర్ మానేజర్ పై కామెంట్స్ చేశాడు.. మొదటి సినిమా అతనొక్కడే తర్వాత రెండో సినిమా ప్రభాస్ తో తాను అనుకుని ఆ పనుల్లో ఉండగా ఎన్టీఆర్ మానేజర్ సుకుమార్ తనని…

ఆల్ మోస్ట్ 3 రోజులు ఎమోషనల్ గా ఎన్టీఆర్ తో సినిమా చేసేలా కమిట్ చేయించాడని, ఎన్టీఆర్ స్టార్ హీరో అవ్వడంతో తాను కూడా తప్పక చేశానని చెప్పాడు. ఎన్టీఆర్ మానేజర్ పై నింద వేసినా అది ఎన్టీఆర్ కి తెలియకుండా ఉండదు కాబట్టి ఎన్టీఆర్ పై కూడా చేసినట్లే అని భావించి ఎన్టీఆర్ ఫ్యాన్స్ సురేందర్ రెడ్డి పై సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు.

అంతలా ఎమోషనల్ బ్లాక్ మైల్ చేశారు అంటున్నావ్ కదా…మరి మొదటి సినిమా, కిక్, రేసుగుర్రం సినిమాలు నువ్వు ముందు వినిపించింది ఎన్టీఆర్ కే అని చెప్పావ్ దానిమెంటావ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అది నిజమే కాగా సురేందర్ రెడ్డి మొదటి సినిమా చేసింది ఎన్టీఆర్ అన్న కళ్యాణ్ రామ్ బ్యానర్ లో కళ్యాణ్ రామ్ తోనే కాగా…

ఎన్టీఆర్ తో అశోక్ అయిష్టంగా చేసినా తర్వాత మళ్ళీ ఊసరవెల్లి చేశాడు… ఎన్టీఆర్ బ్యానర్ లో కిక్ 2 చేశాడు. రేసుగుర్రం కథ ఎన్టీఆర్ కి వినిపించగా నిర్మాతని సజెస్ట్ చేసింది కూడా ఎన్టీఆర్ అని న్యూస్ వచ్చింది. అలాంటి ఎన్టీఆర్ పై ఇలాంటి కామెంట్స్ సురేందర్ రెడ్డి ఎందుకని చేయాల్సివచ్చింది అన్నది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అని చెప్పొచ్చు.

Leave a Comment

Do NOT follow this link or you will be banned from the site!