గాసిప్స్ న్యూస్ బాక్స్ ఆఫీస్ స్పెషల్

గర్జించడం మొదలెట్టిన టైగర్…కేరళ గడ్డ అదరబోతుంది!!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో అత్యంత భారీ గా తెరకెక్కుతున్న సినిమా “అరవింద సమేత వీర రాఘవ” అఫీషియల్ ఫస్ట్ లుక్ రీసెంట్ గా రిలీజ్ అయ్యి సోషల్ మీడియా ని ఓ కుదుపు కుదిపేసిన విషయం అందరికీ తెలిసిందే. కాగా ఈ సారి త్రివిక్రమ్ ఫాం అంత బాగా లేకున్నా కానీ యంగ్ టైగర్ ఫామ్ మాత్రం అదిరిపోయే రేంజ్ లో ఉండటం అంచనాలు కూడా రోజు రోజు కి పెరిగి పోతూనే ఉన్నాయని చెప్పొచ్చు.

కాగా ఇప్పుడు ఈ సెన్సేషనల్ మూవీ ని తెలుగు తో పాటు మలయాళం లో కూడా ఏక కాలం లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు మొదలు పెట్టారు. త్వరలోనే దీని పై స్పష్టమైన వార్తా వెలువడే అవకాశం ఉందని చెబుతుండటం విశేషం.

 జనతాగ్యారేజ్ సినిమా తో అక్కడ తొలిసారి అడుగు పెట్టిన ఎన్టీఆర్ కి అద్బుతమైన విజయం దక్కక పోయినా మంచి పేరు అయితే వచ్చింది. దాంతో ఇప్పుడు త్రివిక్రమ్ తో చేస్తున్న ఈ సినిమా ను అక్కడ కూడా రిలీజ్ చేసి దుమ్ము లేపాలని ప్లాన్ చేస్తున్నారు.

Leave a Comment

Do NOT follow this link or you will be banned from the site!