న్యూస్ బాక్స్ ఆఫీస్

అరవింద సమేత 220+ నాట్ అవుట్!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఅర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో అత్యంత భారీ ఎత్తున రూపొందుతున్న సినిమా అరవింద సమేత వీర రాఘవ….అత్యంత భారీ ఎత్తున అక్టోబర్ 11 న రిలీజ్ కి సిద్ధం అవుతున్న ఈ సినిమా పై అంచనాలు పీక్స్ లో ఉన్నాయి.

ఇక సినిమా రిలీజ్ కి సమయం కేవలం రెండు వారాలు మాత్రమె ఉండటంతో రిలీజ్ ఎ రేంజ్ లో ఉంటుందో అని అందరిలోనూ ఆసక్తి పెరిగిపోయింది. ఓవర్సీస్ లో ఎన్టీఆర్ కెరీర్ లో ఆల్ టైం రికార్డ్ లెవల్ లో రిలీజ్ కి ఈ సినిమా సిద్ధం అవుతుంది.

కాగా ప్రస్తుతానికి ఓవర్సీస్ లోకేషన్స్ కౌంట్ సుమారు గా 220 వరకు ఉందని సమాచారం….రిలీజ్ సమయానికి ఈ లోకేషన్స్ కౌంట్ భారీ గా పెరిగే అవకాశం ఉంది. మొత్తం మీద రిలీజ్ సమయానికి 320 నుండి 350 వరకు లోకేషన్స్ లో సినిమా రిలీజ్ ని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం, ఇదే నిజం అయితే ఇక ప్రీమియర్ షో కలెక్షన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో చూడాలి.

Leave a Comment

Do NOT follow this link or you will be banned from the site!