గాసిప్స్ న్యూస్

OTT లో సూపర్ హిట్…ఇప్పుడు శాటిలైట్ రైట్స్ ఎంతంటే??

బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు సినిమాలు రిలీజ్ అయ్యే అవకాశం మరి కొంత కాలం లేనట్టే కాబట్టి చాలా సినిమాలు డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ కి సిద్ధం అవుతున్న విషయం తెలిసిందే, హిందీ లో పెద్ద సినిమాలు రిలీజ్ అవుతుంటే తెలుగు లో మాత్రం చిన్న చితకా సినిమాలు మాత్రమె రిలీజ్ అవుతుండగా కొంచం నోటబుల్ మూవీ గా వచ్చిన లేటెస్ట్ మూవీ ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య సినిమా రీసెంట్ గా రిలీజ్ అయ్యింది.

కాగా సినిమా కి డిజిటల్ రిలీజ్ అయినా కానీ మంచి టాక్ లభిస్తుంది అని చెప్పాలి. సోషల్ మీడియా లో సినిమా పై మంచి చర్చ జరుగుతుండగా కొన్ని కొన్ని క్యారెక్టర్స్ పెర్ఫార్మెన్స్ అందరికీ బాగా నచ్చుతుంది. ఇక సినిమా రిలీజ్ అయిన ప్లాట్ ఫాం…

నెట్ ఫ్లిక్స్ లో టాప్ 5 లో ట్రెండ్ అవుతూ దూసుకు పోతున్న ఈ సినిమా కి ఓవరాల్ గా సాలిడ్ హిట్ అయిందని చెప్పాలి. ఇక సినిమా శాటిలైట్ రైట్స్ ని రీసెంట్ గా ఎప్పుడూ పోటి పడే ఛానెల్స్ కాకుండా ఈటీవీ కి అమ్మారని సమాచారం.

అతి తక్కువ సమయంలోనే ఈటీవీ సినిమాలను కొంటూ వస్తుంది ఈ మధ్యన. ఈ సినిమా కోసం పోటి ఎదురు అయినా కానీ ట్రేడ్ లో వినిపిస్తున్న వార్తల ప్రకారం 2.2 కోట్ల రేంజ్ రేటు చెల్లించి సినిమా శాటిలైట్ రైట్స్ హక్కులను ఈ టీవీ సొంతం చేసుకుందని సమాచారం. ఇక మరో విచిత్రం ఏంటంటే…త్వరలోనే మంచి డేట్ చూసుకుని సినిమా ను టెలికాస్ట్ చేస్తారట.

ఈ టీవీ కొనడం తో సినిమా రెగ్యులర్ గా టెలికాస్ట్ అవుతుందా లేదా అన్నది చెప్పలేం, ఎప్పుడో కానీ కొత్త సినిమాలను కొనని ఈ టీవీ ఈ సారి కొత్త సినిమాను కోని త్వరలో టెలికాస్ట్ చేస్తాం అంటుండటంతో కచ్చితంగా రూట్ మార్చి మిగిలిన ఛానెల్స్ తో పోటి పడబోతుందా అన్న టాక్ వినిపిస్తుంది. ఇక OTT లో సూపర్ హిట్ అయిన ఈ సినిమా బుల్లి తెరపై కూడా కుమ్మేస్తుందో లేదో చూడాలి.

Leave a Comment