న్యూస్ బాక్స్ ఆఫీస్

పేట డే 1 ఓపెనింగ్స్…రాంపేజ్ స్టార్ట్!

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన లేటెస్ట్ మూవీ పేట బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ ఎత్తున రిలీజ్ అవ్వగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ లో అన్ని చోట్లా దుమ్ము లేపే రేంజ్ లో ఓపెనింగ్స్ తో దూసుకు పోతుంది, సినిమా తమిళనాడు లో అజిత్ కుమార్ విశ్వాసం నుండి తీవ్ర పోటి ని ఎదురుకుంటున్నా కానీ మిగిలిన చోట్లా మాత్రం ఎలాంటి పోటి లేకుండా ఏలుతుంది.

తెలుగు లో మాత్రం స్ట్రైట్ మూవీస్ వలన ఈ సినిమా కి థియేటర్స్ అనుకున్న రేంజ్ లో దొరకలేదు కానీ ఉన్నంతలో సినిమా మొదటి రోజు ఓపెనింగ్స్ 30% కన్నా ఎక్కువ ఉండటం షో షో కి రేంజ్ పెరుగుతుండటం తో తొలిరోజు రెండు రాష్ట్రాలలో ఈ సినిమా 3- 4 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకోవచ్చు.

ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ బాగుంటేనే ఈ మార్క్ సాధ్యం. ఇక తమిళ్ లో 12 నుండి 15 కోట్ల రేంజ్ లో గ్రాస్ అందుకోవచ్చు అంటున్నారు, వరల్డ్ వైడ్ గా కూడా తొలిరోజు షేర్ 22 నుండి 25 కోట్ల వరకు ఉండే చాన్స్ ఉందని అంటున్నారు. మరి ఈవినింగ్ అండ్ నైట్ షోల గ్రోత్ ని బట్టి ఈ లెక్క పెరగడమో తగ్గడమో జరుగుతుంది అని చెప్పాలి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

Leave a Comment

Do NOT follow this link or you will be banned from the site!