న్యూస్ రివ్యూ

పేట USA రివ్యూ

   సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన లేటెస్ట్ మూవీ పేట భారీ అంచనాల నడుమ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది, చాలా కాలం తర్వాత వింటేజ్ రజినీకాంత్ ని ఈ సినిమా లో చూడబోతున్నాం అంటూ డైరెక్టర్ తో ప్రతీ ఒక్కరు చెప్పడం, ట్రైలర్ మంచి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకోవడం తో అంచనాలు పెరిగి పోయాయి. రెగ్యులర్ షోల కి ముందుగా ఓవర్సీస్ ప్రీమియర్ షోల నుండి సినిమా టాక్ ఏంటో బయటికి వచ్చేసింది.

ఆ టాక్ ప్రకారం వింటేజ్ రజినీ ఈజ్ బ్యాక్ అనే అంటున్నారు ఓవర్సీస్ ఆడియన్స్, కథ గురించి పక్కకు పెడితే… చాలా కాలంగా సూపర్ స్టార్ రజినీకాంత్ ని అభిమానులు ఎలా చూడాలి అనుకుంటున్నారో డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజ్ అలాగే చూపెట్టాడని అంటున్నారు.

యాక్షన్ సీన్స్, స్టైల్, మ్యానరిజమ్స్ తో సినిమా మొత్తం రజినీ వన్ మ్యాన్ షో గా మారిందని అంటున్నారు. కథ పెద్దగా బలంగా లేకపోయినా రజినీ హీరోయిజం చూడాలి అనుకునే వాళ్ళకి హార్డ్ కోర్ ఫ్యాన్స్ కి ఈ సినిమా ఒక విందు భోజనం అని అంటున్నారు.

పకబ్దండీ కథ లేకపోవడం, స్టొరీ ప్రిడిక్ట్ చేసే విధంగా ఉండటం, సెకెండ్ ఆఫ్ బోర్ సీన్స్ ఉండటం మేజర్ మైనస్ పాయింట్స్ అని కానీ వాటిని మరిపించే విధంగా ప్రతీ 10 -15 నిమిషాల్లో ఒక ఎలివేషన్ సీన్, హీరోయిజం సీన్స్ తో డైరెక్టర్ దుమ్ము లేపాడని అంటున్నారు.

అనిరుద్ అందించిన సంగీతం బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమా కి బాగా ప్లస్ అయిందని, మాస్ మరణ సాంగ్ ఫ్యాన్స్ కి ఫీస్ట్ అని అంటున్నారు, మిగిలిన నటీనటులు తమ పెర్ఫార్మెన్స్ తో మెప్పించినా కానీ ఇది పూర్తిగా రజినీ మ్యానియా అని అంటున్నారు.

ఫైనల్ గా ఓవర్సీస్ ఆడియన్స్ నుండి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు రెగ్యులర్ ఫ్యాన్స్ షోల నుండి కూడా టాక్ ఇలానే ఉండటం ఖాయం, అసలు సిసలు కామన్ ఆడియన్స్ నుండి టాక్ ఇలానే ఉంటె ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర వింటేజ్ రజినీ వీరంగం ఖాయమని చెప్పొచ్చు.

Leave a Comment

Do NOT follow this link or you will be banned from the site!