న్యూస్ బాక్స్ ఆఫీస్ స్పెషల్

ఫ్లాఫ్ సినిమాలకు కొత్త బెంచ్ మార్క్ సెట్ చేసిన రామ్ చరణ్

ఒక హీరో నిజమైన స్టామినా ఆ హీరో సూపర్ హిట్ కొట్టినప్పుడు కన్నా ఆ హీరో సినిమా ఫ్లాఫ్ అయినప్పుడు ఎంత రికవరీ చేసేదానిమీదే ఉంటుంది. ఒక హీరో ఫ్లాఫ్ టాక్ తోనూ సినిమాకు పెట్టిన బడ్జెట్ ని రికవరీ చేస్తే అతనినే నిజమైనా హీరో అనాలి. కాని టాలీవుడ్ లో ఇప్పటివరకు ఫ్లాఫ్ టాక్ తెచ్చుకున్న ఏ పెద్ద సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర సేఫ్ అయినట్లు చరిత్రలో లేదు.

కాని ఫ్లాఫ్ వచ్చినప్పుడు ఏ సినిమా ఎంత కలెక్ట్ చేసింది అని లెక్క తీస్తే ఇప్పటివరకు స్పైడర్ సినిమా అట్టర్ ఫ్లాఫ్ టాక్ తో తెలుగు వర్షన్ 49.5 కోట్లవరకు కలెక్ట్ చేసింది, అల్లుఅర్జున్ నా పేరు సూర్య 54 కోట్లు, పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి 57.5 కోట్లు కలెక్ట్ చేశాయి.

కాని రీసెంట్ గా విడుదల అయిన రామ్ చరణ్ వినయ విధేయ రామ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటిరోజే అట్టర్ ఫ్లాఫ్ టాక్ తెచ్చుకుంది, కాని పండగ సమయంలో వచ్చిన సెలవులను ఉపయోగించుకున్నవినయ విధేయ రామ ఈ టాక్ తోనూ 60 కోట్ల మార్క్ దాటింది.

దాంతో ఫ్లాఫ్ టాక్ తెచ్చుకున్న తెలుగు సినిమాల్లో హైయెస్ట్ కలెక్షన్లు సాధించింది. దాంతో ఇప్పుడు ఏ స్టార్ హీరో సినిమా అయిన ఫ్లాఫ్ టాక్ వస్తే తమ స్టామినాని నిరూపించుకోవడానికివినయ విధేయ రామని క్రాస్ చేయాలి… ఇక్కడ సినిమాకి దొరికిన మరో అడ్వాంటేజ్ హైర్స్ అని చెప్పాలి.

బహుశా రీసెంట్ టైం లో ఏ తెలుగు సినిమా కి దక్కని విధంగా టోటల్ రన్ లో 14.5 కోట్ల వరకు హైర్స్ సినిమా కి కలిసి వచ్చాయి. దాంతో ఫైనల్ రన్ లో సినిమా 63 కోట్ల షేర్ మార్క్ ని అందుకుంది… మరి వినయ విధేయ రామ ని అధిగమించే సినిమా ఏది అవుతుందో చూడాలి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

Leave a Comment

Do NOT follow this link or you will be banned from the site!