న్యూస్ బాక్స్ ఆఫీస్

2.0 డే 6 బాక్స్ ఆఫీస్ ఓపెనింగ్స్…హిందీ ఓకే…కానీ!!

సూపర్ స్టార్ రజినీకాంత్ అక్షయ్ కుమార్ ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ రోబో 2.0 బాక్స్ ఆఫీస్ దగ్గర 5 రోజుల్లో టోటల్ గా 425 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ ని అందుకోగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 6 వ రోజున రెండు తెలుగు రాష్ట్రాల్లో జస్ట్ యావరేజ్ గా ఓపెన్ అయింది. ఓవరాల్ గా ఈ రోజు ఓపెనింగ్స్ ని బట్టి సినిమా తెలుగు లో 2 కోట్ల రేంజ్ లో వసూళ్లు రాబట్టే చాన్స్ ఉంది.

తెలుగు కన్నా కూడా హిందీ లో సినిమా కుమ్ముతుంది. సినిమా అక్కడ 5 రోజుల్లో 111 కోట్ల నెట్ వసూళ్లు సాధించగా 6 వ రోజు ఓపెనింగ్స్ ని బట్టి చూస్తె 10 కోట్ల రేంజ్ నెట్ కలెక్షన్స్ మరోసారి కన్ఫాం అని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు.

కానీ తమిళ్ కలెక్షన్స్ మాత్రం దిమ్మతిరిగే షాక్ ఇచ్చయనే చెప్పాలి. ఓ రేంజ్ లో అంచనా వేసినప్పటికీ సినిమా అక్కడ ఏమాత్రం ఆకట్టుకోలేని కలెక్షన్స్ ని సాధిస్తుంది. మొత్తం మీద ఈ రోజు లెక్క 25 కోట్ల నుండి 30 కోట్ల రేంజ్ లో గ్రాస్ ని వరల్డ్ వైడ్ గా అందుకునే చాన్స్ ఉందని చెప్పొచ్చు.

Leave a Comment

Do NOT follow this link or you will be banned from the site!