గాసిప్స్ న్యూస్

RRR కే పోటికి సిద్ధం అవుతున్న స్టార్ హీరో సినిమా…!!

ఇండియా మొత్తం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ మూవీ ఆర్ ఆర్ ఆర్… ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా కరోనా వేవ్ ల వలన పోస్ట్ పోన్ లు అవుతూనే ఉంది, యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ సినిమా సెన్సేషనల్ మూవీ కి ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ చేస్తుండగా ఆల్ ఇండియా మొత్తం…

ఈ సినిమా కోసం ఎదురు చూస్తుంది ఇప్పుడు… సినిమా ఆడియన్స్ ముందుకు ఈ సారి ఎట్టి పరిస్థితులలో కూడా అక్టోబర్ 13 నే రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతున్న విషయం తెలిసిందే. ఆ టైం కి ఇండియా వైడ్ గా పరిస్థితులు ఇంకా సెట్ కాకపొతే తప్పితే…

సినిమా రిలీజ్ అవ్వడం ఖాయమని చెప్పాలి. ఇక ఈ సినిమా రిలీజ్ టైం లో ఇప్పుడు పోటికి ఒక స్టార్ హీరో సినిమా సిద్ధం అవుతుంది అంటూ టాక్ గట్టిగా వినిపిస్తుంది. ఆ సినిమా మరేదో కాదు కోలివుడ్ టాప్ హీరోలలో ఒకరైన అజిత్ కుమార్ వలిమై సినిమా అని అంటున్నారు.

ఈ సినిమాను ముందు దీపావళికి అనుకున్నా అప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు అలాగే రజినీ అన్నాతే సినిమా ఆల్ రెడీ రిలీజ్ ను కన్ఫాం చేసుకోవడం తో దసరాని టార్గెట్ చేసి ఈ సినిమాను రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందని నిర్మాత బోనీ కపూర్ భావిస్తున్నారట. ఇక్కడ ఆశ్యర్యకరమైన విషయం ఏంటంటే ఆర్ ఆర్ ఆర్ దసరాకి అనౌన్స్ చేసిన టైం లో…

బోనీ కపూర్ నిర్మాణంలో అజయ్ దేవగన్ హీరోగా మైదాన్ సినిమాను ముందుగా అనౌన్స్ చేశారు. RRR వచ్చినా వెనక్కి తగ్గం అన్నారు, కానే సెకెండ్ వేవ్ వలన తగ్గక తప్పలేదు కానీ ఆ సినిమా ప్లేస్ లో ఇప్పుడు వలిమైని దింపాలని చూస్తున్నారట. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందీ అన్నది అఫీషియల్ అనౌన్స్ మెంట్ వరకు వెయిట్ చేయాల్సిందే…

Leave a Comment