గాసిప్స్ న్యూస్

RRR “కొమురం భీమ్” అప్ డేట్ ఆ రోజే!

టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ మూవీస్ లో ముందు నిలిచే సినిమా ఆర్ ఆర్ ఆర్… ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కలయికలో తెరకెక్కుతున్న ఈ సెన్సేషనల్ మూవీ మొదలు అయ్యి రెండేళ్ళు అవుతుండగా వచ్చే సంక్రాంతి కి వస్తుంది అనుకున్నా కరోనా ఎఫెక్ట్ తో మళ్ళీ పోస్ట్ పోన్ అవ్వగా కరోనా టైం కన్నా ముందే రామ్ చరణ్…

పుట్టిన రోజు కోసం లుక్ అండ్ మేకింగ్ వీడియో ని సిద్ధం చేసి పెట్టగా ఎన్టీఆర్ బర్త్ డే నాటికి కంప్లీట్ లాక్ డౌన్ అవ్వడం తో పోస్టర్ ని కూడా రిలీజ్ చేయలేక పోయారు, కానీ తర్వాత కచ్చితంగా అప్ డేట్ ఉంటుంది అన్నట్లు రామ్ చరణ్ కామెంట్స్ పెట్టగా…

ఇప్పటి వరకు ఎలాంటి అప్ డేట్ రానే రాలేదు, ఇక రీసెంట్ గా మైల్డ్ కరోనా సిమ్టమ్స్ రావడంతో ప్రస్తుతం కోలుకుంటున్న రాజమౌళి ఈ ఆగస్టు 15 న ఆర్ ఆర్ ఆర్ అప్ డేట్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారని సమాచారం. మరీ రామ్ చరణ్ బర్త్ డే లా మేకింగ్ వీడియో…

ఇవ్వకున్నా కానీ సినిమాలో ఎన్టీఆర్ కొమురం భీమ్ లుక్ ని ఆ రోజు రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారని తెలుస్తుంది. దానికి సంభందించిన వర్క్ కూడా మొదలు పెట్టారని టాక్ ఉంది కానీ కచ్చితమైన అప్ డేట్ లేదు. త్వరలోనే దీనిపై మరిన్ని వివరాలు వెలువడే అవకాశం ఉందని తెలుస్తుంది. లాక్ డౌన్ టైం లో ఆర్ ఆర్ ఆర్ కన్నా కూడా.

లేట్ గా ప్రారంభం అయిన సినిమాల అప్ డేట్స్ వచ్చాయి కానీ ఆర్ ఆర్ ఆర్ అప్ డేట్స్ పెద్దగా రాలేదు, ముఖ్యంగా ఎన్టీఆర్ లుక్ గురించిన ఎలాంటి న్యూస్ రాకపోవడంతో ఫ్యాన్స్ ఈగర్ గా లుక్ కోసం ఎదురు చూస్తున్నారు. మరి ఈ సారి అయినా అనుకున్నట్లు ఆగస్టు 15 న కొమురం భీమ్ లుక్ ని రివీల్ చేస్తారో లేదో చూడాలి…

Leave a Comment