న్యూస్

RRR మ్యూజిక్ రైట్స్….చరిత్ర చిరిగిపోయే రేటుకి అమ్మారు!

టాలీవుడ్ నంబర్ 1 డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కాంబినేషన్ లో అజయ్ దేవగన్, ఆలియా భట్, శ్రేయ, సముద్రఖని ఇలా అల్టిమేట్ స్టార్ కాస్ట్ తో రూపొందుతున్న సెన్సేషనల్ పాన్ ఇండియన్ మూవీ ఆర్ ఆర్ ఆర్ పై ఎలాంటి అంచనాలు ఉన్నాయో అందరికీ తెలిసిందే. ఆల్ ఇండియా లెవల్ లో ఈగర్ గా ఎదురు చూస్తున్న…

సినిమాల్లో ముందు నిలిచే సినిమా ఇది. ఎప్పుడెప్పుడు సినిమా వస్తుందా అని ఎన్టీఆర్-రామ్ చరణ్ ఫ్యాన్స్ ఆశగా ఎదురు చూస్తున్న ఈ సినిమా బిజినెస్ ల పరంగా కొత్త రికార్డులను నమోదు చేస్తూ దూసుకు పోతుండటం విశేషం. రీసెంట్ గా సినిమా ఆడియో రైట్స్ ని…

టి సిరీస్ వాళ్లకి అలాగే లహరి మ్యూజిక్ వాళ్లకి అమ్మగా హిందీ మరియు సౌత్ లో ఈ సినిమా సాంగ్స్ ఆ ఛానెల్స్ లోనే రిలీజ్ కాబోతున్నాయి. ఇక ఈ రైట్స్ కోసం ఇతర పెద్ద మ్యూజిక్ కంపెనీ లు కూడా పోటి ఓ రేంజ్ లో పడినప్పటికీ కూడా టి సిరీస్ వాళ్ళు…

ఆల్ టైం ఎపిక్ రేటు చెల్లించి సినిమా మ్యూజిక్ రైట్స్ హక్కులను సొంతం చేసుకున్నారు… ఇండియన్ సినిమా హిస్టరీ లోనే ఏ సినిమా కి కూడా సొంతం కాని విధంగా ఏకంగా 26 కోట్ల మమ్మోత్ రేటు కి సినిమా మ్యూజిక్ రైట్స్ అమ్ముడు పోయాయని సమాచారం. ఇది సౌత్ లోనే కాదు ఏకంగా ఇండియాలోనే సరికొత్త రికార్డ్ గా చెప్పుకుంటున్నారు ఇప్పుడు.

ఇక సినిమాలోని మొదటి సాంగ్ త్వరలోనే రిలీజ్ చేయబోతున్న విషయం తెలిసిందే. ఇండియా మొత్తం ఆశగా ఎదురు చూస్తున్న ఈ ఎపిక్ మూవీ ప్రస్తుతానికి కూడా అక్టోబర్ 13 నే రిలీజ్ కి సిద్ధం అవుతూ ఉండటం విశేషం. అప్పటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటే ఆర్ ఆర్ ఆర్ ఊచకోత ఆల్ ఇండియాని షేక్ చేయడం ఖాయమని చెప్పొచ్చు.

Leave a Comment