న్యూస్

RRR రిలీజ్ డేట్…రికార్డుల ఊచకోత ఖాయం…కానీ 3 షాక్ లు ఉన్నాయి!!

ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కాంబినేషన్ లో అత్యంత భారీ ఎత్తున రూపొందుతున్న సెన్సేషనల్ మల్టీ స్టారర్ మూవీ ఆర్ ఆర్ ఆర్ కోసం టోటల్ ఇండియా ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉండగా ముందు సినిమాను జులై ఎండ్ 2020 లో రిలీజ్ అనుకున్నారు కానీ షూటింగ్ డిలే వాళ్ళ అది 2021 సంక్రాంతి కి పోస్ట్ పోన్ అవ్వగా కరోనా వలన అది కూడా పోస్ట్ పోన్ అయ్యి….

కొత్త రిలీజ్ డేట్ ఏది అవుతుందా అని ఆశగా ఎదురు చూస్తున్న టైం లో ఎట్టకేలకు సినిమా యూనిట్ సినిమా రిలీజ్ డేట్ ని కన్ఫాం చేశారు. అక్టోబర్ 13 న దసరా కానుకగా సినిమా ఇండియాలో అన్ని మెయిన్ భాషల్లో రిలీజ్ కాబోతుంది అని డిక్లేర్ చేశారు.

దసరా 15 న ఉండగా 18 వరకు కంప్లీట్ హాలిడేస్ ఉన్నాయి. దాంతో మొదటి వారం సినిమా కలెక్షన్స్ రికార్డ్ బ్రేకింగ్ లెవల్ లో ఉండే అవకాశం ఉండగా అదే సమయం లో ఇప్పుడు 3 ఎదురు దెబ్బలు కూడా ఉన్నాయి అని చెప్పాలి. దసరా సీజన్ టాలీవుడ్ కి ఓపెనింగ్స్ తెచ్చినా…

లాంగ్ రన్ ఉన్న సినిమాలు ఈ మధ్య అయితే లేవు, ఇక ఓవర్సీస్ మార్కెట్ అప్పటికి కంప్లీట్ గా సెట్ అవుతుందా లేదా అన్న అనుమానాలు ఉన్నాయి. బాహుబలి ఒక్క అమెరికాలోనే 140 కోట్లు వసూల్ చేసింది. టోటల్ ఓవర్సీస్ లో ఊచకోత కోసింది…RRR కూడా అంతకుమించి దుమ్ము లేపాలంటే కంప్లీట్ గా అన్ని చోట్లా పరిస్థితులు సెట్ అవ్వాలి… ఇక మూడోది…

సినిమాలో కీలక పాత్ర చేస్తున్న అజయ్ దేవగన్ తను నటించిన మైదాన్ అనే పాన్ ఇండియా మూవీ ని 15 న రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. మరి ఇప్పుడు రిలీజ్ పోస్ట్ పోన్ చేస్తారా లేదా పోటిలోనే ఉంచుతారా చూడాలి… మొత్తం మీద అడ్డుగా ఉన్న 3 అడ్డంకులను RRR దాటేసి చరిత్ర కెక్కె విజయాన్ని నమోదు చేయాలని మనం కోరుకుందాం…

Leave a Comment