గాసిప్స్ న్యూస్

RRR షూటింగ్ అప్ డేట్…ఎన్టీఆర్ లుక్ ఎప్పుడు, ఆలియా భట్ ఎప్పుడు జాయిన్ అవుతుందంటే!

ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో ముందు నిలిచే సినిమా ఆర్ ఆర్ ఆర్, వచ్చే ఇయర్ సంక్రాంతి కానుకగా రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా కరోనా వల్ల పోస్ట్ పోన్ అవ్వగా 6 నెలల నుండి సినిమా యూనిట్ మొత్తం ఇంట్లోనే ఉంటూ వచ్చారు. దాంతో రామ్ చరణ్ బర్త్ డే కి లుక్ అండ్ ఇంట్రో టీసర్ రిలీజ్ అయినా ఎన్టీఆర్ బర్త్ డే కి లుక్ కానీ టీసర్ కానీ రిలీజ్ అవ్వలేదు.

ఎన్టీఆర్ బర్త్ డే అయిపోయి 4 నెలలు అయిపోయినా ఇప్పటికీ టీం ఇంట్లో నే ఉండటం తో లుక్ ఎప్పుడు వస్తుంది అన్నది సస్పెన్స్ గానే ఉన్నప్పటికీ ఎట్టకేలకు చాలా టైం తర్వాత ఆర్ ఆర్ ఆర్ తిరిగి షూటింగ్ కి వెళ్ళే టైం ఆల్ మోస్ట్ కన్ఫాం అయిందని చెప్పాలి.

రాజమౌళి కూడా కరోనా నుండి పూర్తిగా కోలుకుని చాలా టైం అవ్వగా ఇక కరోనా తగ్గుముఖం కోసం ఎదురు చూడకుండా అన్ని సినిమాల మాదిరిగానే ఈ సినిమా షూటింగ్ ని కూడా మొదలు పెట్టాలని ఫిక్స్ అవ్వగా టైం ని వచ్చే నెల దసరా టైం కి ఫిక్స్ చేశారని సమాచారం.

దానికన్నా ముందే కొన్ని రోజుల టెస్ట్ షూట్ చేసి దసరా తర్వాత ఇద్దరు హీరోలను కూడా సెట్స్ పైకి రప్పిస్తారని సమాచారం. ఇప్పటికే ఇటు ఎన్టీఆర్ అటు రామ్ చరణ్ లు మళ్ళీ బాడీ బిల్డ్ చేసే పనిలో ఉన్నారని అంటున్నారు. ఇక ఆలియా భట్ సినిమా యూనిట్ తో నవంబర్ లో కలుస్తుందని సమాచారం.

ఇక ఎన్టీఆర్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కొమరం భీమ్ ఫస్ట్ లుక్ అండ్ ఇంట్రో టీసర్ లు, న్యూ ఇయర్ కి వచ్చే అవకాశం ఎక్కువగా ఉండగా… ముందు ఎన్టీఆర్ ఇంట్రో టీసర్ పైనే జక్కన్న దృష్టి పెడితే దీపావళి కి రిలీజ్ అయ్యే అవకాశం కూడా ఉందని అంటున్నారు. అప్పుడు మిస్ అయితే ఇక న్యూ ఇయర్ కే రిలీజ్ అని అంటున్నారు.

Leave a Comment