న్యూస్ బాక్స్ ఆఫీస్

70 కోట్లు~..సౌత్ ఇండస్ట్రీ మైండ్ బ్లాంక్

కోలీవుడ్ స్టార్ హీరో ఇళయ ధలపతి విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ సర్కార్ మొదటి రోజు ఓవరాల్ గా అల్టిమేట్ రికార్డులను నమోదు చేసింది. అఫీషియల్ లెక్కలు ఇంకా కొన్ని ఏరియాల లో రిలీజ్ అవ్వాల్సి ఉండగా మొత్తం మీద సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్ గా సాధించిన గ్రాస్ లెక్కలు అందరి ఊహకలకీ మించి ఓ రేంజ్ లో సెంసేషన్ ని క్రియేట్ చేసేలా ఉన్నాయి. ఒకసారి సినిమా కలెక్షన్స్ ని పరిశీలిస్తే..

తమిళనాడు లో మొదటి రోజు 30 కోట్ల రేంజ్ లో గ్రాస్ ని, రెండు తెలుగు రాష్ట్రాలలో 4 కోట్ల రేంజ్ గ్రాస్ ని, కర్ణాటకలో 6.8 కోట్ల రేంజ్ గ్రాస్ ని, కేరళలో 6.6 కోట్ల గ్రాస్ ని రెస్ట్ ఆఫ్ ఇండియా లో 1.3 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకున్న ఈ సినిమా…

టోటల్ ఓవర్సీస్ లో ఆల్ టైమ్ రికార్డ్ లెవల్ లో 21 కోట్ల రేంజ్ లో గ్రాస్ ని అందుకుందట. దాంతో మొదటి రోజు ఓవరాల్ కలెక్షన్స్ లెక్కలు టోటల్ గా 70 కోట్ల రేంజ్ లో ఉండే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది నిజంగానే బిగ్గెస్ట్ షాక్ ఇచ్చే రికార్డు కలెక్షన్స్ అని చెప్పొచ్చు.

1 Comment

Leave a Comment

Do NOT follow this link or you will be banned from the site!