న్యూస్ బాక్స్ ఆఫీస్

కేరళలో బాహుబలి రికార్డ్ అవుట్…ఏం క్రేజ్ సామి ఇది!

ఇళయ ధలపతి విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ సర్కార్ మొదటి రోజు ఇండస్ట్రీ రికార్డులు మైండ్ బ్లాంక్ అయ్యేలా ఉన్నాయి. సినిమా తమిళనాడు లో ఆల్ టైమ్ బిగ్గెస్ట్ డే 1 రికార్డుల దుమ్ము దుమారం చేయగా చెన్నై ఏరియాలోనే సరికొత్త ఇండస్ట్రీ రికార్డ్ ను సొంతం చేసుకుంది. ఇక సినిమా ఇప్పుడు కేరళలో మొదటి రోజు కలెక్షన్స్ పరంగా మన బాహుబలి 2 నెలకొల్పిన రికార్డును బ్రేక్ చేసి భీభత్సమైన రికార్డ్ ను నెలకొల్పింది.

అక్కడ మన బాహుబలి 2 మలయాళ వర్షన్ మొత్తం మీద మొదటి రోజు 5.45 కోట్ల గ్రాస్ ని అందుకుని మలయాళ ఇండస్ట్రీ రికార్డులు తిరగరాయగా ఆ రికార్డులు ఇప్పటికీ కొనసాగాయి. కానీ విజయ్ నటించిన సర్కార్ సినిమా మొదటి రోజు అక్కడ ఏకంగా….

6.6 కోట్ల గ్రాస్ ని అందుకుని ఆల్ టైమ్ బిగ్గెస్ట్ రికార్డ్ ను నెలకొల్పింది. ఏకంగా 1.15 కోట్ల లీడింగ్ తో సరికొత్త బెంచ్ మార్క్ ని అక్కడ సెట్ చేసి సంచలనం సృష్టించింది ఈ సినిమా. ఇక మిగిలిన ఏరియాల కలెక్షన్స్ కూడా ఒక్కోటిగా రిలీజ్ అవుతూ సంచలనం సృష్టిస్తున్నాయి.

Leave a Comment

Do NOT follow this link or you will be banned from the site!