న్యూస్ బాక్స్ ఆఫీస్

60 లక్షల మార్జిన్ తో ఇండస్ట్రీ రికార్డ్ కొట్టిన సర్కార్!

కోలివుడ్ స్టార్ హిరో ఇలయ దళపతి విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ సర్కార్ బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు కలెక్షన్స్ పరంగా ఇండస్ట్రీ రికార్డుల వేట ని మొదలు పెట్టింది. కాగా అందులో భాగంగా సినిమా చెన్నై ఏరియా కి గాను టోటల్ కోలివుడ్ సినీ ఇండస్ట్రీ లో ఎ సినిమా సాధించని చరిత్రను సృష్టించింది. మొదటి రోజు ఇది వరకు ఉన్న రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ రికార్డును భారీ మార్జిన్ తో బ్రేక్ చేసింది.

మొదటి రోజు అక్కడ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన కాలా 1.76 కోట్ల గ్రాస్ తో సంచలన రికార్డ్ ని చెన్నై లో సాధించగా ఏకంగా 61 లక్షల మార్జిన్ తో కోలివుడ్ మూవీస్ లో చెన్నై లో మొదటి రోజు 2 కోట్లు అందుకున్న మొట్టమొదటి సినిమాగా నిలిచిన….

సర్కార్ మొదటి రోజు అక్కడ 2.37 కోట్ల గ్రాస్ ని అందుకుని చరిత్ర సృష్టించే ఇండస్ట్రీ రికార్డ్ ను కొట్టింది. మిగిలిన ఏరియాలలో కూడా సరికొత్త ఇండస్ట్రీ రికార్డ్ కలెక్షన్స్ ని సినిమా సాధించినట్లు సమాచారం. తెలుగు లో కూడా సినిమా విజయ్ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుంది.

Leave a Comment

Do NOT follow this link or you will be banned from the site!