న్యూస్ బాక్స్ ఆఫీస్

సవ్యసాచి 4 డేస్ కలెక్షన్స్…దెబ్బపడింది

అక్కినేని నాగ చైతన్య హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ సవ్యసాచి బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వీకెండ్ మొత్తం మీద 8.5 కోట్ల రేంజ్ లో షేర్ ని వసూల్ చేసిన విషయం తెలిసిందే. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 4 వ రోజు వర్కింగ్ డే టెస్ట్ ను ఎదురుకోగా సినిమా మినిమమ్ కలెక్షన్స్ తో అయినా రోజుని ఘనంగా ముగిస్తుంది అని భావించినా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ షాక్ నే ఇచ్చింది ఈ సినిమా.

మినిమమ్ 80 లక్షల నుండి 1 కోటి మధ్యలో షేర్ వస్తుంది అని భావించినా కానీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద కేవలం 55 లక్షల దాకా మాత్రమే షేర్ ని అందుకుంది. దాంతో సినిమా కలెక్షన్స్ భారీ గా షాక్ ఇచ్చాయని చెప్పొచ్చు.

ఆన్ లైన్ టికెట్ సేల్స్ కొంత బాగున్నా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ విషయం లో మొదటి నుండి సవ్యసాచి భారీ షాక్ లే ఇస్తుంది. మొత్తం మీద 4 రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా 9.05 కోట్ల షేర్ ని సాధించింది. బ్రేక్ ఈవెన్ కి సినిమా మరో 15 కోట్ల షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది.

Leave a Comment

Do NOT follow this link or you will be banned from the site!