గాసిప్స్ న్యూస్

SR కళ్యాణ మండపం హిట్…రెమ్యునరేషన్ డబుల్ చేసిన కిరణ్ అబ్బవరం!!

ఇండస్ట్రీలో ప్రతీ ఒక్కరు కూడా ఎదురు చూసేసి ఒక సక్సెస్ కోసమే, ఆ సక్సెస్ కోసం ఎన్నో కష్టాలు పడతారు, ఆ కష్టాల తర్వాత వచ్చిన సక్సెస్ తో నేము ఫేము వస్తాయి కాబట్టి తర్వాత నుండి కెరీర్ లో మరింత ఎదగడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. టాలీవుడ్ లో చిన్న చితకా సినిమాల నుండి ఎంతో కష్టపడి ఎదిగిన వాళ్ళు ఉన్నారు, కొత్తగా అడుగు పెట్టడం సక్సెస్ తో అడుగు పెట్టిన వాళ్ళు ఉన్నారు.

ఫస్ట్ సినిమాలు రీచ్ కాకపోయినా తర్వాత సక్సెస్ అందుకున్న నటులు ఉన్నారు. ఇలాంటి కోవలోకే చేరే నటుడు కిరణ్ అబ్బవరం, మొదటి సినిమా రాజా వారు రాణి గారు సినిమా థియేటర్స్ లో అసలు ఆడలేదు, జనాలకు ఎక్కనూ లేదు. కానీ సినిమా డిజిటల్ రిలీజ్ తో…

మంచి పాపులారిటీని దక్కించుకుని కిరణ్ అబ్బవరంకి ఛాన్సులు దక్కేలా చేసింది. రెండో అవకాశంగా SR కళ్యాణ మండపం సినిమా దక్కగా ఈ సినిమా సాంగ్స్ సూపర్ హిట్ అవ్వడం, సినిమా ఆడియన్స్ అంచనాలను అందుకునే రేంజ్ లో ఉండటం తో బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ నుండి బ్లాక్ బస్టర్ గా…

నిలిచే కిరణ్ కి సాలిడ్ బ్రేక్ ఇచ్చింది. దాంతో కిరణ్ అబ్బవరం అప్ కమింగ్ మూవీస్ ని మరింత బాగా ప్లాన్ చేసుకుంటూ ఉండగా రీసెంట్ గా తన బర్త్ డే టైం లో ఒక్కో సినిమా కి 40-50 లక్షల రేంజ్ లో రెమ్యునరేషన్ అని టాక్ వచ్చినా ఇప్పుడు ఆ రెమ్యునరేషన్ కి కూడా డబుల్ అనిపించే విధంగా ఒక్కో సినిమా కి…

కోటి దాకా రెమ్యునరేషన్ ని తీసుకుంటున్నాడట. SR కళ్యాణ మండపం సెకెండ్ పాండమిక్ తర్వాత ది బెస్ట్ హిట్ అనిపించుకోవడం తో తనకి కూడా ఒక మార్కెట్ ఏర్పడింది. దాంతో ఇప్పుడు సినిమా కి కోటి రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకునే లెవల్ కి తక్కువ టైం లోనే చేరుకున్నాడు కిరణ్ అబ్బవరం, మరి SR కళ్యాణ మండపం సక్సెస్ ని ఈ సినిమాలతో ఎంతవరకు కంటిన్యూ చేస్తాడో చూడాలి.

Leave a Comment