న్యూస్ బాక్స్ ఆఫీస్

డే 1 (40+)…అమీర్ ఖానా మజాకా

బాలీవుడ్ ఏస్ ఖాన్ అమీర్ ఖాన్ మరియు మెగా స్టార్ అమితాబ్ బచ్చన్ ల కాంబినేషన్ లో యష్ రాజ్ మూవీస్ బ్యానర్ లో తెరకెక్కిన సెన్సేషనల్ మూవీ థగ్స్ ఆఫ్ హిందుస్తాన్… బాక్స్ ఆఫీస్ దగ్గర అత్యంత భారీ ఎత్తున రిలీజ్ అవ్వగా సినిమా కి టాక్ మరీ అనుకూలంగా లేకపోయినా కానీ అప్పటికే జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ కి తోడు సోలో రిలీజ్ మరియు పండగ హాలిడే సినిమాకి కలిసి వచ్చింది.

దాంతో మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా టోటల్ ఇండియా వైడ్ గా అద్బుతమైన కలెక్షన్స్ ని సాధించిందని సమాచారం. మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోల ఆక్యుపెన్సీ తక్కువగానే ఉన్నా ఈవినింగ్ అండ్ నైట్ షోల బుకింగ్స్ జోరుగా ఉండటంతో…

మొదటి రోజు ముగిసే సమయానికి ఈ సినిమా టోటల్ ఇండియా లో 40 కోట్లకు పైగా నెట్ వసూళ్లు అందుకునే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. బాలీవుడ్ హిస్టరీలో ఫస్ట్ డే 40 కోట్లకు పైగా నెట్ వసూళ్లు సాధించిన అతి కొద్ది సినిమాల్లో ఈ సినిమా ఒకటిగా చేరడం ఆల్ మోస్ట్ కంఫామ్ అయినట్లే అని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.

Leave a Comment

Do NOT follow this link or you will be banned from the site!