న్యూస్ స్పెషల్

రామ్ చరణ్ బర్త్ డే టోటల్ ట్వీట్ కౌంట్ ఇదే…షాకింగ్!

కెరీర్ లో చేసిన 12 సినిమాల్లో రెండు ఇండస్ట్రీ రికార్డు సినిమాలతో సెన్సేషనల్ ట్రాక్ రికార్డ్ ను సొంతం చేసుకున్న హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. టాలీవుడ్ హీరోలలో అత్యధిక 40 కోట్ల సినిమాలు అతి తక్కువ సినిమా లలో సొంతం చేసుకున్న హీరో కూడా రామ్ చరణే. లాస్ట్ ఇయర్ రంగస్థలం తో ఊహకందని ఇండస్ట్రీ రికార్డులతో మిగిలిన స్టార్ హీరోల కి నికార్సయిన బాక్స్ ఆఫీస్ టార్గెట్ ని….

సెట్ చేసిన మెగా పవర్ స్టార్ పుట్టిన రోజు వేడుకలు 27 న అంబరాన్ని అంటే విధంగా ఆఫ్ లైన్ లో ఆన్ లైన్ లో జరిగాయి. ఆఫ్ లైన్ లో అభిమానులు పలు విధాలుగా సేవా కార్యక్రమాలు చేయగా ఆన్ లైన్ లో ఫ్యాన్స్ ట్వీట్స్ తో భారీ గా నే ట్రెండ్ చేసినా సరికొత్త రికార్డులు నమోదు కాలేదు.

ఎలేక్షన్స్ సమయం అవ్వడం, ఈ ఆన్ లైన్ రికార్డులు వదిలివేసి ఎలివేషన్ ట్వీట్స్ వేయాలని ఫ్యాన్స్ డిసైడ్ అయ్యి 24 గంటల ట్రెండ్ లో 2 లక్షల 72 వేల ట్వీట్స్ తో సరిపెట్టారు. ఇతర హీరోల పుట్టిన రోజు ట్రెండ్స్ తో పోల్చితే ఇది చాలా తక్కువే అని చెప్పాలి.

కానీ ఫ్యాన్స్ కేవలం ఎలివేషన్ ట్వీట్స్ తో చేసి ట్రెండ్ అని చెబుతుండటం తో ఇకమీదట మిగిలిన ఫ్యాన్స్ కూడా ఇదే రూట్ కి వెళ్ళే అవకాశం ఉందని చెప్పాలి. దాంతో సోషల్ మీడియా వార్స్ కొంచం వరకు తగ్గే అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. ఇక రామ్ చరణ్ పుట్టిన రోజున…

సెలెబ్రిటీ ల విషెస్ కూడా భారీ లెవల్ లో నే ట్రెండ్ అయ్యాయి. నేషనల్ వైడ్ గా వరల్డ్ వైడ్ గా ఈ బర్త్ డే ట్రెండ్ ఉందని చెప్పొచ్చు. రామ్ చరణ్ మరిన్ని అద్బుతమైన సినిమాలు తీసి నటుడిగా మరింత ఎదగాలని మనం మరోసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.

Leave a Comment

Do NOT follow this link or you will be banned from the site!