న్యూస్

TRP రికార్డులు బద్దలు కొట్టడానికి ఇది అల్టిమేట్ ఛాన్స్!!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన మెగా మమ్మోత్ మూవీ సైరా నరసింహా రెడ్డి బాక్స్ ఆఫీస్ దగ్గర దసరా బరిలో ఎలాంటి భారీ అంచనాల నడుమ రిలీజ్ అయ్యిందో అందరికీ తెలిసిందే. మొదటి ఆటకే సూపర్ హిట్ టాక్ ని అందుకున్న ఈ సినిమా దసరా సెలవుల వరకు అల్టిమేట్ కలెక్షన్స్ ని వసూల్ చేసినా తర్వాత స్లో డౌన్ అయ్యి ఇతర భాషల్లో నాసిరకం ప్రదర్శన వలన మొత్తం మీద.

హిట్ గీత ని దాటలేక ఫ్లాఫ్ గా మిగిలిపోయింది. ఓపెనింగ్స్ విషయం లో రికార్డులు కొట్టినా లాంగ్ రన్ లో రికార్డులను మిస్ చేసుకున్న ఈ సినిమా కి ఇప్పుడు బుల్లితెర పై రికార్డ్ లు బ్రేక్ చేయడానికి మంచి అవకాశం దక్కనుంది అని చెప్పొచ్చు. సినిమా ను భారీ రేటు చెల్లించి కొన్న…

జెమినీ టీవీ వారు త్వరలోనే సైరా నరసింహా రెడ్డి ని టెలికాస్ట్ చేయబోతున్నట్లు సమాచారం. దాంతో సినిమా రిలీజ్ అయిన రెండు నెలల లోపే టెలికాస్ట్ కి సిద్ధం అవుతున్న కారణంగా బుల్లితెర పై సంచలన రికార్డులను నమోదు చేసే అవకాశం ఉందని అంతా భావిస్తున్నారు.

డానికి మరో రీజన్ సినిమా మాస్టర్ ప్రింట్ ఇంకా రిలీజ్ కాకపోవడమే. అది కూడా త్వరలోనే రిలీజ్ కానుండగా ఛానెల్ వాళ్ళు మాస్టర్ ప్రింట్ రిలీజ్ కన్నా ముందే సినిమాను టెలివిజన్ లో టెలికాస్ట్ చేయాలనీ చూస్తున్నారు. ప్రస్తుతానికి బార్క్ వచ్చిన తర్వాత హైయెస్ట్ TRP రేటింగ్ అందుకున్న సినిమా గా బాహుబలి 2 22.7 TRP  రేటింగ్ తో టాప్ లో ఉంది.

మెగాస్టార్ సైరా సినిమా అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ రికార్డ్ ను బ్రేక్ చేయడానికి అవకాశం ఉందని చెప్పొచ్చు. ఖైదీ నంబర్ 150 సినిమా మాస్టర్ ప్రింట్ వచ్చిన చాలా టైం తర్వాత టెలికాస్ట్ అవ్వడం తో TRP విషయం లో నిరాశ పరచగా ఇప్పుడు సైరా ఈ నెల లో టెలికాస్ట్ కానుండటం తో అమెజాన్ ప్రైమ్ కన్నా ముందు టెలివిజన్ లో టెలికాస్ట్ అయితే కచ్చితంగా భారీ TRP ని అందుకోవచ్చు.

Leave a Comment