న్యూస్ బాక్స్ ఆఫీస్

యూటర్న్ తెలుగు అండ్ తమిళ్ వీకెండ్(4 డేస్) టోటల్ కలెక్షన్స్

సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ యూటర్న్ బాక్స్ ఆఫీస్ దగ్గర శైలజా రెడ్డి అల్లుడు తో పోటి పడి రిలీజ్ అవ్వగా మొదటి రోజు కొద్దిగా అండర్ పెర్ఫార్మ్ చేసినా కానీ తరువాత రోజు నుండి సూపర్ పాజిటివ్ పవర్ హెల్ప్ తో దుమ్ము లేపింది అని చెప్పొచ్చు.

ఓవరాల్ గా 4 రోజుల వీకెండ్ లో సినిమా సాధించిన కలెక్షన్స్ ని పరిశీలిస్తే…రెండు రాష్ట్రాలలో 3.4 కోట్లు, కర్ణాటకలో 65 లక్షలు, టోటల్ ఓవర్సీస్ లో 60 లక్షల షేర్ ని అందుకుంది ఈ సినిమా. దాంతో టోటల్ గా తెలుగు వర్షన్ కి గాను 4.65 కోట్ల షేర్ ని అందుకుంది.

ఇక తమిళ్ వర్షన్ టోటల్ గా 1.45 కోట్ల షేర్ ని అందుకుందని సమాచారం. దాంతో తెలుగు తమిళ్ కలిపి సినిమా 6.1 కోట్ల షేర్ ని అందుకుంది. సినిమాను తెలుగులో 8 కోట్లకు, తమిళ్ లో 6 కోట్లకు అమ్మారు. మరి సినిమా రెండు భాషల్లో బ్రేక్ ఈవెన్ అవుతుందో లేదో చూడాలి.

Leave a Comment

Do NOT follow this link or you will be banned from the site!