న్యూస్ బాక్స్ ఆఫీస్ స్పెషల్

VVR లో 300…RRR లో 1000

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ల కలయిక లో టాలీవుడ్ నంబర్ 1 డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఎపిక్ మల్టీ స్టారర్ మూవీ RRR శరవేగంగా షూటింగ్ జరుపుకుంటూ దూసుకు పోతుంది, కాగా రీసెంట్ గా ఎన్టీఆర్ పై కొన్ని కీలక సన్నివేశాలు షూటింగ్ చేయగా తన పనిని ముగించిన ఎన్టీఆర్ కొన్ని రోజులు రెస్ట్ తీసు కుంటు న్నాడని సమాచారం.

ఇక వినయ విధేయ రామ కంప్లీట్ అవ్వడం తో రామ్ చరణ్ తో బాలెన్స్ ఉన్న షెడ్యూల్ షూటింగ్ ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీ లో జరుగుతుండగా భారీ జూనియర్ ఆర్టిస్టుల నడుమ ఫైట్ సీన్ ని రామ్ చరణ్ తో రాజమౌళి చిత్రీ కరిస్తున్నట్లు సమాచారం అందుతుంది.

అది కూడా ఏకంగా 1000 మంది తో ఫైట్ సీన్ ని ఓ రేంజ్ లో చిత్రీ కరిస్తున్నాడట రాజమౌళి. ఇక్కడ 1000 మంది అనే సరికి ఇది వరకు రామ్ చరణ్ మూవీస్ మగధీర లో 100 మంది తో నభూతోన భవిష్యత్ అనిపించే లెవల్ లో ఫైట్ సీన్ ని రూపొందించాడు రాజమౌళి.

కాగా తర్వాత చేసిన సినిమాల్లో ఫైట్ సీన్స్ బాగానే ఉన్నా ఇంత మంది తో ఫైట్ అని చూపెట్టని సినిమా గా వినయ విధేయ రామ అని చెప్పొచ్చు. సినిమాలో బోయపాటి రామ్ చరణ్ తో 300 మంది తో ఫైట్ సీన్ ని షూట్ చేసినా లెంత్ వలన సినిమాలో పెట్టకుండా డైలాగ్ తోనే సరిపెట్టాడు.

అందులో 300 తో ఫైట్ చేసిన రామ్ చరణ్ ఈ సారి ఏకంగా 1000 మంది తో ఫైట్ చేయబోతున్నాడన్న మాట. రాజమౌళి టేకింగ్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. సినిమాలో ఈ ఫైట్ వన్ ఆఫ్ ది హైలెట్ గా నిలుస్తుంది అనడం లో సందేహం లేదు. త్వరలోనే ఎన్టీఆర్ తో కూడా మరో భారీ ఫైట్ సీన్ షూట్ జరగబోతున్నట్లు సమాచారం. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

Leave a Comment

Do NOT follow this link or you will be banned from the site!